Categories
సూప్స్ భోజనంతో సమానమైన పోషకాలు అందిస్తాయి. తక్కువ క్యాలరీలున్న వెజిటెబుల సూప్ భోజనానికి ముందు తీసుకోవడం వల్ల కాలరీల ఇన్ టెక్ 20 శాతం తగ్గుతుందని అద్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక విస్తృతమైన అద్యాయనంలో సూప్ తయారీ విదానం పెద్ద క్యాలరీలను ప్రభవితం చెయ్యదని తయారికి ఏ పదార్ధం వినియోగించినా ఫలితం ఒకే రకంగా ఉంటుందని వివరించారు. భారీగా క్రీమ్ లేదా చీజ్ ఆదారిత సూప్ లు తాగితేనే క్యాలరీలు చేరతాయి. భోజనానికి ముందు తప్పని సరిగా సూప్ ఎంచుకోవాలి. అది సాదా వెజిటెబుల్ సూప్ లానే తీసుకుంటే ఆహారం తగ్గించి తినే వీలు కలుగుతుందని చెబుతున్నారు. అలాగే కాస్ట్ ,ప్యాకేజీ సూప్ లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కనుక తక్కువ సోడియం రకాలను ఎంచుకోమంటున్నారు.