దొండకాయలో ఔషధ గుణాలే ఎక్కువంటారు ఎక్స్ పర్ట్స్. ఆకులు కామెర్ల వ్యాధిని తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థ పని తీరులో కీలక పాత్ర వహించే బి2 విటమిన్ ఈ కాయల్లో సమృద్ధిగా ఉంటుంది. వీటిలోని B6, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కలిసి అల్జీమర్స్ , మూర్చ వంటి వ్యాధుల్ని రానివ్వవు. ఈ కాయల రసం తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. దొండకాయ నమిలితే నోటి పుండ్లు తగ్గుతాయి. బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కీ దొండ అచ్చం ఔషధంలాగే ఉపయోగపడుతుంది. అస్తమాతో సహా ఇతరాత్ర శ్వాస సంబంధిత వ్యాధుల్ని నివారిస్తుంది. దొండ కాయ ఎక్కువగా తినే వాళ్ళలో మాత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు.

Leave a comment