Categories
వీడియో గేమ్స్ ఆడేవాళ్ళలో వార్ధక్యపు లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ల నైపుణ్యాన్ని ఇవి పెంచుతాయి అంటున్నాయి. ఇంకో అధ్యయనం రిపోర్ట్ లో పిల్లలు బయటకు పోయి ఆడటం శరీరానికి ఎలా వ్యాయామమో వీడియో గేమ్స్ ఆడటం అలాంటి మానసిక వ్యాయామం అంటున్నారు. అయితే బ్లూవేల్ వంటి ప్రమాదకరమైన ఆటల జోలికి మాత్రం పోవద్దంటున్నారు.ఈ గేమ్స్ ని ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలట. ఒకటి రెండు సార్లు ఓడిపోయానా నిరుత్సహం లేకుండా మళ్ళీ ప్రయత్నిస్తే ఓర్పూనేర్పూ అలవడతాయి అంటున్నాయి అధ్యయనాలు. త్వరగ నిర్ణయాలు తీసుకొనే సామార్థ్యం అలవడుతుంది. ఒత్తిడి తగ్గించుకొనేందుకు టి.వి చూడటం కన్న వీడియో గేమ్ ఆడటం మంచిదని అధ్యయనాలు చెపుతున్నాయి.