Categories
ఇప్పటికి భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఆడపిల్లలకు 18 ఏళ్ళ వయసుల రాకుండానే 27శాతం పెళ్ళళ్ళు అయి పోతున్నాయని యూనిసెఫ్ నివేదిక చెబుతుంది. గతంలో 11నెలలకే రాజస్థాన్ లో పెళ్ళయిపోయిన శాంతాదేవి మీడియా ముందుకు వచ్చింది. ఇలాంటి బాల్య వివాహాలు,టినేజ్ వివాహాలు నిరోధించేందుకు గట్టి చట్టం తీసుకురావాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ తన తాజా నివేదికలో భారత ప్రభుత్వానికి సూచించింది. టినేజ్ వివాహాలు ఆడపిల్లల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.