Categories
జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. కొన్ని ఆహార పదార్ధాలు ఈ సమస్య నుంచి బయటపడేస్తాయి.కొన్ని ఆహారపదార్ధాలు ఈ సమస్య నుంచి బయటపడేస్తాయి. అల్లం సహజంగా అరుగుదలను పెంచి ఇన్ ఫ్లమేషన్స్ తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను శాంతపరుస్తుంది. అల్లంటీ తాగడం ,అల్లం రసం,తేనె కలిపి తీసుకోవడం మంచిదే.బొప్పాయి పండులో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ ఆహారం అరుగుదలను ప్రత్యేకించి మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారాన్ని ఆరగించటంలో సాయపడుతుంది. తాజా పెరుగు తోనూ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడవచ్చు. తులసి ఆకలతోనూ ఎసిడిటి సమస్య తగ్గుతుంది. రాత్రి భోజనం తర్వాత పెప్పర్ మెంట్ చామంతి తీ తాగితే ఆజిర్ణం తగ్గిపోతుంది.