Categories
కొన్ని రకాల గింజల్ని పని గట్టుకొని తినండి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గుమ్మడి గింజల్లో పనాగమిక్ ఆసిడ్ అనే పోషకం ఉంటుంది. ఆక్సిజన్ లేదా పెరాక్సైడ్ పెరగటం వల్ల కలిగే దుష్ర్పభావాన్ని పనాగమిక్ ఆసిడ్ నిరోధిస్తుంది. ఒత్తిడిని నివారించటానికి గుమ్మడిగింజలు ఎంతో దోహద పడతాయి. అలసట పోగోడతాయి. ఎదో ఒకటి తినాలి అనే ఆలోచన తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచటంతో పాటు ఆర్థరైటిస్ ముప్పు తగ్గిస్తుంది. ఈ గింజల్ని పొడి చేసి పాలు ,పెరుగన్నంలో కూడా చల్లుకొని తినవచ్చు.