Categories
ఒంటికి అతుక్కుపోయే బిగుతుగా ఉండే లెగ్గింగ్స్ , జీన్స్ తో ఈ సీజన్ లో కష్టమే అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఒంటికి గాలి తగిలే మార్గం లేక ఈస్ట్ వృద్ది చెంది ఇన్ ఫెక్షన్స్ దాడి చేస్తాయి. బిగుతుగా ఉండే బ్రాలతో లింఫాటిక్ కణజాలానికి హాని జరగవచ్చు. నడుము, భుజాల నొప్పి వచ్చే అవకాశం ఉంది. శరీరాకృతి కోసం వేసుకొనే షేప్ వేర్ వాడక పోవటమే మంచింది. బిగుతుగా ఉండే అండర్ వేర్ లతో మూత్ర సంబంధిత, సంతాన సాఫల్యత సమస్యలు వస్తాయి. నరాలపై ఒత్తిడి పెరిగి స్పర్శ తగ్గటం తిమ్మిర్లు రావటం మొదలవుతుంది. బిగుతైన దుస్తులు జోళికి పోకపోవటమే బెస్ట్..