Categories
పళ్ళు తినటానికి , దీర్ఘకాలం జీవించటానికి గల సంబంధాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు ఐదు లక్షల మంది జీవితాలను పరిశీలించారు పరిశోధకులు. 30 ఏళ్ళ నుంచి 79 ఏళ్ళు ఉన్న వాళ్ళు వీళ్ళు. ఏడేళ్ళ పాటు ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తే పళ్ళు తినే వాళ్ళలో రక్త పోటు గుండె జబ్బులు లేవు. డయాబెటీస్ ప్రమాదం 12 శాతంగా నమోదైంది. పరిశోధన మొదలు పెట్టిన తర్వాత పళ్ళు తినే అలవాటున్న వారిలో సుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఆరోగ్య సమస్యలు ఎత్తక పోవటాన్ని గమనించారు.గుండె జబ్బులతో మరణించిన వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అకాల మృత్యువుని పళ్ళు దూరం చేస్తాయని కనిపెట్టారు పరిశోధకులు.