Categories

కేరళ నృత్యరూపాలు కథాకళి ,ధెయ్యం ,ఓట్టన్ ధుళ్ళాల్ వంటి వాటిలో మేకప్ ప్రక్రియ చాలా ప్రత్యేకంగా ఉంటుంది . ఇది సుదీర్ఘంగా గంటల కొద్దీ సాగుతుంది . మేకప్ కు వాడే రంగులన్నీ సాధారణంగా సహజమైనవే వాడతారు . కొబ్బరినూనె ఆధారంగా,పూలు ,ఆకులు రాళ్ళ ఉంచి తాయారు చేస్తారు . కొన్ని రంగులు కొన్ని స్వభావాలను చూపెడతాయి . ఆకుపచ్చ రంగు మంచిని ప్రతిబింబిస్తుంది . తెలుపు ఆధ్యాత్మికతను ,ఎరుపును ఫ్యాషన్ గాను,నలుపును అశుభ సూచకంగా వాడతారు ప్రత్యేకం ఓట్టన్ ధుళ్ళాల్ నృత్య రూపకం కాస్త తక్కువ ప్రాచుర్యం పొందింది. వస్త్రధారణ,మేకప్ కదలికలు కధకాళి లాగే ఉంటాయి. పురాణాల నుంచి సామజిక వాస్తవాల వరకు నృత్య రూపకంగా ప్రదర్శిస్తారు .