కలకాలం ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటే ఆహార నియమాలు పాటించి తీరాలి. మధ్య ధరా సముద్ర ప్రాంతంలో వున్న వాళ్ళు పండ్లు, కూరగాయలు, ఆలివ్ నూనె, చేపలు, ఎండు పండ్ల ఆహారంగా తీసుకుంటారు. వారిది ప్రపంచంలో కెల్లా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారమని గుర్తించారు. దాదాపు అందరూ దీర్ఘాయుష్మంతులే. అనారోగ్యాలు అక్కడ చాలా తక్కువ . అంతర్గతంగా క్రోమోజములు దెబ్బతిని అనారోగ్యాలు వస్తాయి. గ్ర్రేకు ఆహారం లో అలాంటి ప్రమాదాలు ఏమీ లేవు. అంచేత పూర్తిగా కాకపోయిన, కనీసం వారానికి రెండు సార్లు అయినా అలాంటి ఆహారం తో సరిపెట్టుకుంటే కొన్ని అనారోగ్యాలు రాకుండా ఉంటాయేమో.

Leave a comment