ప్రపంచంలో ఏదైనా సక్సెస్ అయిటే వెంటనే వ్యాపారులు దాన్ని బ్రాండ్ గా మార్చుకొంటారు. బహుబలి సినిమా రిలీజ్ అయ్యాక ఆ పేరుపైన దుస్తులు, నగలు, బొమ్మలు హడావుడి చేసాయి. ఇప్పుడీ క్రేజ్ హాటల్లలోకి కుడా పాకింది. బాహుబలి బిర్యానీ భాల్లాలదేవ చికెన్ 65, దేవసేన దోస, అవంతిక ఆలూఫ్రై దేశవ్యాప్తంగా ఎన్నో హోటళ్ళలో బాహుబలి మెనూ నడుస్తుంది. ఇక బాహుబలి ధీలీ అయితే పది రకాల పరాటాలు, ఆరు రకాల డిజర్టులు, మూడు అన్నం వెరిటీలు 13 రకాల కూరలు, లస్సీలు, అప్పడాలు, పెరుగు, సలాడ్స్ ఉంటాయి. ఈ భోజనాన్ని భార్యా భర్తలు ఇద్దరు కలిసి 45 నిమిషాల లోపు తినగలిగితే 11 వేల రూపాయిల బహుమతి కుడా ఇస్తారట. ముంబాయి, పూణేల్లోని ఆహాజీ, భావోజీ అనే హాటల్ ఆఫర్ ఇది వెతికితే ఇలాంటి కుంభకర్ణ, బకాసురుడు ధీలీలు ఎన్నో వున్నాయి.

Leave a comment