సినిమాల్లో శకుంతలలో, లేదా ముని ఆశ్రమంలో వుండే యువతలో చెవులకు పువ్వులు అలంకరించ కొంటే చూసేందుకు బావుందే అనుకోని వుంటాం. ఇప్పుడు అమ్మాయిలు మోడ్రన్ శకుంతలలు అయిపోతున్నారు. పూల అందాల యాక్ససరీస్ పెట్టుకుని మెరిసిపోతున్నారు. ఖరీదైన ప్లాస్టిక్, రంగురాళ్ళతో, బంగారు పూత పూసిన లోహాలతో తయ్యారు చేసిన ఈ పూత నగలు ఇటు ఫ్యాషన్ గా అటు సంప్రదాయ డిజైన్ ల తో రావాడం తో అమ్మాయిలకు నచ్చే సాయి. సహజమైన పువ్వుల్లాంటి జుంకీలు , చాంద్ బాలీలు, రింగులు చూడగానే కళ్ళకు పగ్గాలు వేస్తున్నాయి. ఆన్ లైన్లో ఎన్నో డిజైన్స్ చూడచ్చు.

Leave a comment