వంకాయ కూర అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే బోలెడంత మంది కితాబు ఇచ్చేసారు. ఎన్నో విశిష్టమైన గుణాలున్న వంకాయ కూర కానే కాదు, విటమిన్స్, ఫాస్పరస్, కాపర్, డైటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్ మొదలైనవి పుష్కలంగా దొరికే బలవర్ధకం కుడా. ఇందులో  కోలెస్ట్రోల్ అస్సలు లేదు. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతూ వాటిని పటిష్టం చేస్తాయి. ఇది ఆస్ట్రియో పోరోసిన్ ను నిర్వహించడంలో, లేదా ఆలస్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, కాపర్, రెండు ఉంటాయి. వంకాయ లోని ఫైటో న్యుట్రియంట్లు మెదడును చురుగ్గా ఉంచుతాయి. అవి ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని మెదడుకు సరఫరా చేస్తాయి. ఎలా తిన్నా వంకాయ అరిగ్యం ఇచ్చేదే.

Leave a comment