Categories
మకర సంక్రాంతికి అయ్యప్ప స్వాములు జ్యోతి దర్శనం చేసుకుని శబరిమల నుండి తిరిగి వచ్చేశారు.మకర సంక్రాంతికి పంటలు చేతికి వచ్చాయని ఆనందోత్సాహంతో పల్లె ప్రజలు కూడా సంకురుమయ్యని చల్లని దీవించమని గుమ్మడి కాయ,చేతికర్ర,గొడుగు, చాప,గంధం గిన్నె, పాంకోళ్ళు,పొంగలి కుండ,చెరుకు గడలు,గాలిపటాలతో ఆహ్వానించి ఆహ్లాదంగా పండగ వాతావరణం కనిపిస్తుంది.
భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజులలో చిన్న పెద్ద తప్పకుండా ఎండలో సమయం గడపాలి.ఈ మూడు రోజులలో సూర్య నారాయణుని ప్రభావంతో మనకు “డి”విటవిన్ సమ్రుధ్ధిగా లభిస్తుంది.
నిత్య ప్రసాదం:కొబ్బరి,అరిసెలు, చకినాలు.
-తోలేటి వెంకట శిరీష