Categories
చిప్స్ తినటం పిల్లలకు ఎంతో ఇష్టం . అలాగే పెద్దవాళ్ళకి కూడా కాలక్షేపం కోసం ,టి.వి చూస్తూ ,పనిలో ఉత్సాహం కోసం పక్కనే చిప్స్ పెట్టుకొని తింటూ ఆనందించే వాళ్ళు ఎంతోమంది కానీ ఈ చిప్స్ . నూనెలు ఫ్రై చేయటం ,ఉప్పు అధికంగా ఉండటం ,పాడై పోకుండా ప్రిజర్వేటివ్స్ కలపటం వల్ల వీటిని తినటం కోరి అనారోగ్యం తెచ్చుకోవటమే అంటున్నారు . మార్కెట్ లో రకరకాల చిప్స్ ,రకరకాల ప్లేవర్స్ లతో తయారై నోరూరిస్తూ ఉంటాయి . వీటిలో మధుమేహం ,అధిక బరువు అల్సర్ లు రావటం తప్పించి ఉపయోగం శూన్యం అంటున్నారు . చిన్నపిల్లలకు అలవాటు చేయద్దని చెపుతున్నారు .