Categories
కరోనా సమయంలో ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే వారి బాగోగులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.కుటుంబ సభ్యులు తరచుగా ఇల్లు దాటి బయట తిరగటం ఆపేయాలి.ఇంట్లోకి అడుగు పెట్టే ముందుగా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలి.పనివాళ్లను ఇళ్లలో అడుగుపెట్టనీయకూడదు.పెద్దలు బయటికి వెళ్లే అవసరం లేకుండా అవసరమైన వస్తువులు సమకూర్చి పెట్టాలి. సామాజిక దూరం పాటించాలి.మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి వారు ఉండే గదిని పరిశుభ్రంగా ఉంచాలి. పిల్లలను వారితో సన్నిహితంగా మెల్లగా కాకుండా చూసుకోవాలి. పెద్దలకు మంచి వ్యాయామం ఉండేలా చూడాలి వారికి ఒంటరి భావన కలగకుండా ఎక్కువ సమయం వారితో గడపాలి.