ఇతరులకు సాయం చేయడమే మా మతం అంటారు కుంగ్ ఫూ నన్స్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో కోవిడ్ వచ్చాక ఈ బౌద్ధ మహిళ భిక్షువులు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలకు ఎంతగానో సేవ చేశారు దాదాపు 2000 కుటుంబాలకు రేషన్ అందించారు హిమాలయాల పొడవునా ఆహారం లేక అలమటించిన పశువులకు కుంగ్ ఫూ నన్స్ మేత ఏర్పాటు చేశారు. కోవిడ్ గురించి కొండ ప్రాంత ప్రజలకు చైతన్యం కలిగించారు. అయితే ఈ కొండ ప్రాంతాలు దిగాక అక్కడ ఉండే స్త్రీల సమస్యలు బాగా అర్థం చేసుకున్నాం అంటారు నన్స్. శానిటరీ నాప్ కిన్ సమస్య తీవ్రంగా ఉంది.ఇక వాటిని వీరికి అందుబాటులోకి తెచ్చేందుకు పని చేస్తామంటున్నారీ కుంగ్ ఫూ నన్స్. దుక్సా అనే బౌద్ధ శాఖ 2015 వీరికి కుంగ్ ఫూ నేర్చుకునే అనుభూతి ఇచ్చింది.పర్వత ప్రాంతాల్లో ట్రాఫికింగ్ కు గురయ్యే ఆడపిల్లలను రక్షించటం కోసం వీరు ఈ యుద్ధ విద్య నేర్చుకున్నారు.
Categories