Categories
అస్సాం లోని చైగావ్ సమీపంలోని గ్రామ వాసులతో ఈ సినిమా తీసింది రీమా దాస్ అది ఆమె స్వగ్రామం 2018 లో ఉత్తమ పిల్లల చిత్రంగా ఎంపికైంది ఎన్నో అవార్డులు తీసుకుంది ఆస్కార్ కు పంపబడింది బసంతి దాస్ తన పదేళ్ళ కూతురు ధను, పన్నెండేళ్ళ కొడుకు చిన్న పొలంలో వరి పండిస్తూ పిల్లలను పెంచుకుంటూ ఉంటుంది. ఆ ఊర్లో జరిగిన ఒక జాతర ఒక ట్రూప్ వారు చేసిన పాటకచేరీ లో వాయించిన వాయిద్యాలు ధను ను ఆకర్షిస్తాయి. ఎప్పుడు ఆ పాప మనసులో గిటార్ మెదులుతూ ఉంటుంది. ధర్మకోల్ గిటార్ తో తన తోటి పిల్లలతో విలేజ్ రాక్ బ్యాండ్ పేరుతో పాటలు పాడుతుంది.కూతురు మనసు గ్రహించి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి గిటార్ కొనిస్తుంది తల్లి. పిల్లల కలలు ఆశలు ఎలా ఉంటాయో ఎంతో అందంగా చూపించింది ఈ సినిమా అస్సాం అందమంతా చూపించింది. ఈ సినిమాలో డైరెక్టర్ రీమా దాస్.నెట్ ఫ్లిక్స్ లో ఉందీ సినిమా
రవిచంద్ర. సి
7093440630