ఎంత తింటున్నం,ఏం తింటున్నం అన్నదే కాదు ఏ సమయంలో తింటున్నాము అన్నది కూడా ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు అధ్యయనకారులు . సాయంత్రం ఆరుగంటల తర్వాత ఎక్కువ ఆహారం తీసుకొంటే స్త్రీలలో గుండెపోటు,పక్షవాతం ముప్పు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక అధ్యయనం చెపుతోంది. పరిశోధకుల బృందం చేసిన తాజా అధ్యయనంలో 112 మంది మహిళలు కోలెస్టరాల్ ,రక్తపోటు రక్తంలో చెక్కర నిల్వలను రికార్డ్ చేశారు. రోజువారి ఆహారాన్ని సాయంత్రం ఆరుతర్వాత ఎక్కువగా తీసుకొనే మహిళల్లో గుండె,రక్తనాళాల సంబంధిత ఆరోగ్యం దెబ్బ తింటున్నట్లు అధ్యయనాలో చెప్పారు.

Leave a comment