ఒక కప్పు కాఫీ తాగందే తెల్లవారని వాళ్ళు ఎందరో. అలా కాఫీ మెదడుని ఉత్సహపరుస్తోందని ఇప్పటి వరకు అనుకొంటున్నం. గ్రీన్ టీ లాగా గ్రీన్ కాఫీ కూడా వచ్చి ఆరోగ్యానికి మేలు చేస్తోందని రుజువుచేసుకొంది కానీ కాఫీ లో చర్మ సౌందర్యం పెంపొందించుకోవచ్చు ఎన్నో బ్యూటీ ఉత్పత్తులకు బదులు కాఫీ పొడి వాడి చుడండి అంటున్నారు  కాఫీ బాడీ స్క్రబ్ ఉత్పత్తిదారులు. కాఫీ లోని కాఫెయిక్ ఆసిడ్ కొల్లాజెన్ఉత్పత్తికి దోహదపడుతోంది చర్మం పైన మృతకణాలు తాగిస్తోంది. యుగార్త్ తేనె రెండు టేబుల్ స్పూన్లు ,కాస్త కాఫీ పొడి కలిపి పేస్ పాక్ వేసుకొంటే మొహం మెరిసిపోతుందని ఎక్సపర్ట్స్ చెపుతూనే ఉన్నారు ఇప్పుడు కాఫీ బాడీ స్క్రబ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుందని చెపుతున్నారు.

Leave a comment