పవర్ సినిమా తర్వాత హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మా చిన్న కుష్భు అని తమిళులు ముద్దుగా పిలిచే హన్సిక కుష్భు లాగా బొద్దు గానే ఉండేది కానీ ఇప్పుడు స్క్వాష్ లు యోగాలతో ఏకంగా పదమూడు కిలోల బరువు తగ్గిపోయి చాలా స్లిమ్ గా అయిపోయింది. ఇంత పేరు తెచుకున్నాక లేజీ ఓరియెంటెడ్ సినిమాలు చేయచ్చు కదా అని అడిగితే అబ్బే నేనింకా చాలా పెద్దయి ఎంతో అనుభవం సంపాదించుకోవాలి. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి  నాకింకా ఐదేళ్లే . ఇప్పుడు నాకున్న కమర్షియల్ హీరోయిన్ అన్న ఇమేజ్ ను నేను చాలా ఇష్టపడుతున్నా. నేనింకా చాలా చిన్నదాన్నే కదా. ఇప్పట్లో అలంటి పాత్రల జోలికి పోను. తమిళంలో ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలున్నాయి. 31 మంది దత్తత తీసుకున్న పిల్లలున్నారు. వాళ్ళకోసం పెద్ద హోమ్ కట్టాలి. వాళ్ళ బాగోగులు చూడాలి. ఇవన్నీ కష్టమైనా పనులు నా కోసం వుంచి  ఇప్పుడు ప్రయోగాలు చేయును. కమర్షియల్ సినిమాలే ఇప్పుడు నా ధ్యేయం అంటోంది హన్సిక.

Leave a comment