నీహారికా , ఈ రోజంతా అన్నమాచార్య పాడిన ఒక పాట విన్నాను. ఆ కాలానికి ఆయనకు ఇవాళ్టి ప్రపంచం ఎలా అర్ధం అయిందీ అన్నావు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే విన్నానన్నావు. నిజంగా మనసుతో అన్నమాచార్యులు మారుతున్నా సమాజాన్ని మనసుతో జ్ణానంతో అర్ధం చేసుకున్నారు. మనుషులంతా సమానంగా లేని ఈ సమాజం సమస్యల సమాహారంగా ఉంటుందని అర్ధం చేసుకున్నారు. దారితప్పిన స్వార్ధపరులైన వ్యక్తుల్ని చూసారు. నువ్వు అడిగినట్లు ఈ సమాజాన్ని మనుషుల్ని అవధుల్లేని ప్రేమతో చుస్తే అన్నీ అర్ధం, అవుతాయి. సుఖంగా నిద్రించే రాజుకీ అక్కడే ఆయన సేవ కోసం పడివున్న సేవకుడిదీ నిద్ర ఒక్కటేనన్నారు. ప్రకృతిలో అందరికోసం వీచే గాలి దుర్గంధం పైనా పరిమళం పైనా ఒకే రకంగా తాకి పరుగుతీస్తుందన్నారు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికీ జీవించే హక్కుందన్నారు. ప్రకృతి దృష్టిలో అందరు ఒక్కటే. ఈ బేధాలన్నీ మనుషులు సృష్టించినవే నన్నారు. జీవితం మొత్తం ప్రచారం చేసారు. మనస్ఫూర్తిగా మనుషుల సుఖం కోరుకున్నారు కనుకనే ఆసాహిత్యం ఇవాళ్టికీ తరాల నుంచి తరాలకు అందుతోంది. ఇప్పుడు ఆ సాహిత్యపు సువాసన నిన్ను తాకింది. అంత గొప్ప రూపంలో ఉన్న ఏనుగుపైన భూమికి జానెడు లేని కుక్కపైన ప్రసరించే సూర్య కిరణం ఒక్కటేనన్నాడాయన. మరి నీకు నాకు అందరికీ నచ్చదా ? నచ్చాలి కూడా !!
Categories
Nemalika

అర్ధం కావాలంటే అవధుల్లేని ప్రేమ కావాలి

నీహారికా ,

ఈ రోజంతా అన్నమాచార్య పాడిన ఒక పాట  విన్నాను. ఆ కాలానికి ఆయనకు ఇవాళ్టి  ప్రపంచం ఎలా అర్ధం అయిందీ అన్నావు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే విన్నానన్నావు. నిజంగా మనసుతో అన్నమాచార్యులు మారుతున్నా సమాజాన్ని మనసుతో జ్ణానంతో అర్ధం చేసుకున్నారు. మనుషులంతా సమానంగా లేని ఈ సమాజం సమస్యల సమాహారంగా ఉంటుందని అర్ధం చేసుకున్నారు. దారితప్పిన స్వార్ధపరులైన వ్యక్తుల్ని చూసారు. నువ్వు అడిగినట్లు ఈ సమాజాన్ని మనుషుల్ని అవధుల్లేని ప్రేమతో చుస్తే అన్నీ అర్ధం, అవుతాయి. సుఖంగా నిద్రించే రాజుకీ అక్కడే ఆయన సేవ కోసం పడివున్న సేవకుడిదీ నిద్ర ఒక్కటేనన్నారు. ప్రకృతిలో అందరికోసం వీచే గాలి దుర్గంధం పైనా పరిమళం పైనా ఒకే రకంగా తాకి పరుగుతీస్తుందన్నారు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికీ జీవించే హక్కుందన్నారు. ప్రకృతి దృష్టిలో అందరు ఒక్కటే. ఈ బేధాలన్నీ మనుషులు సృష్టించినవే నన్నారు. జీవితం మొత్తం ప్రచారం చేసారు. మనస్ఫూర్తిగా మనుషుల సుఖం కోరుకున్నారు కనుకనే ఆసాహిత్యం ఇవాళ్టికీ  తరాల నుంచి తరాలకు అందుతోంది. ఇప్పుడు ఆ సాహిత్యపు సువాసన నిన్ను తాకింది. అంత గొప్ప రూపంలో ఉన్న ఏనుగుపైన భూమికి జానెడు లేని కుక్కపైన ప్రసరించే సూర్య కిరణం ఒక్కటేనన్నాడాయన. మరి నీకు నాకు అందరికీ నచ్చదా ? నచ్చాలి కూడా !!

Leave a comment