ఎంతగానో వినేందుకు బాగా లేకపోయినా ఈ అధ్యయనం సరిగ్గానే చెపుతుంది. ప్రేమలో వాసనలకు ప్రధమ స్థానం ఇవ్వాలని చెపుతుంది అధ్యయనం. మగవారు కానీ స్త్రీలు కానీ ఎదుటి వాళ్ళలోని పరిమళాలను బట్టే దగ్గరవటం జరుగుతుందట. మంచి వాసనలు రాకపోటే సంబంధాలు బ్రేకప్ అయిపోతాయట. ముక్కులో ఉండే 40 మిలియన్ల ఆల్ ఫ్యాక్టరీ రిసెస్టర్లు భావోద్వేగ ప్రవర్తన జ్ఞాపక శక్తిలకు సంబంధించి మెదడు భాగాలకు సంబంధాలు చేరవేస్తాయి. కొన్ని రకాల దుర్వాసనలు ముక్కులోని ఇతర నర్వ్ సెల్స్ తాకు తాయని ఇవి మెదడు నియంత్రణ భాగాలకు సిగ్నల్స్ చేరవేస్తాయని ,ముఖ్యంగా మగవాళ్ళలో శుభ్రంగా లేకపోవటం ,బట్టల నుంచి ,చెమటల వల్ల వచ్చే దుర్వాసనను మెదడు రిసీవ్ చేసుకోని వారిపట్ల ఒక నెగటీవ్ భావాన్ని వాళ్ళు ప్రేమించే స్త్రీల మెదళ్లలోకి ఎక్కిస్తాయట. సో.. మనుషులు పరిమళ భరితమైన సోప్ ల్లాగా శుభ్రం మడతపడని వస్త్రాల్లాగా ఉండాలని చెబుతోంది ఈ అధ్యయనం.

Leave a comment