సాధారణంగా మనం చౌకగా దొరికే ఏ వస్తువు పైనా మనసు పెట్టం. అది ఖరీదినదైతేనే బాగా పనిచేస్తుందనో మన్నికగా వుంటుందనో  అనుకుంటాం. కానీ ఎంతో ఖరీదైన విదేశీయ పండ్ల కంటే కాపు జామపండు ముక్కల్లో 112 కేలరీలు వుంటాయని రోజుకు సరిపడా  పీచు అందులో ఉంటుందనీ సహక చక్కెర  తో ఉండటం తో కడుపు నిండిన భావన కలుగుతుందనీ డైటింగ్ చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్స్ పెర్ట్స్ చెపుతున్నారు. అలాగే దాల్చిన చెక్క పొడిని పాలల్లో కానీ టీ లో మరిగించి గానీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయంటున్నారు . బరువు తగ్గాలనుకుంటే తినే ఆహారంలో సగంలో  కాలీఫ్లవర్ వుండేలా  చూసుకోమంటున్నారు. కప్పు కాలీఫ్లవర్ లో రెండే గ్రాముల పీచు 27 క్యాలరీలు ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. ఈ పోషకాలు బరువు అదుపు చేస్తూ జీవ క్రియ రేటును సమతుల్యం చేస్తాయి. కప్పు పచ్చి  బఠాణీ లో పీచు విటమిన్లు మాంసకృత్పతులు ఉంటాయి. పుల్కా చపాతీలలో వీటిని తీసుకుంటే బఠాణీ లో వుండే పోషకాలు బరువు తగ్గిచేస్తాయి.

 

Leave a comment