ఏదైనా స్ప్రే,సెంట్ కోసం చూస్తే ఎన్నో రకాలు కనిపిస్తాయి.అన్ని పరిమాళాల్లో దేన్నీ ఎంచుకోవాలి. సందర్భానికి తగ్గట్లు సువాసనలతో ఎంచుకొంటే బావుటుందని అంటారు ఎక్సు్ పర్ట్స్. ఏదైనా సమావేశాల్లో అసలు ఘాటైన వాసన వచ్చే పరిమాళాలు వాడకపోవటమే మంచిది.ఎక్సిన్షియల్ ఇయిల్స్ చర్మంపై రాసుకొంటే ఒక సన్నని పరిమళం మాత్రం చుట్టు ఉందనిపిస్తుంది. అంటే అలాగే రోజంతా పరిమళం నిలిచి ఉండాలన్న ఘాటైనా పరిమళం అవసరం లేదు. తక్కువ సువాసనగలవి రోజు రెండు మూడుసార్లు స్ప్రే చేసుకోవచ్చు .పరిమళం ప్రభావం చర్మంపై పడకుండా ఉండాలంటే ముందుగా పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. అలంకరణ పూర్తయ్యాక అప్పుడు స్ర్పే చేసుకోవాలి .నగలపై ఈ పరిమళం ద్రవ్యాలు,స్ప్రే లు మెరుపును పాడుచేస్తాయి.

Leave a comment