Categories
పొద్దుతిరుగుడు పువ్వు చాలా అందంగా ఉంటుంది. పసుపు పచ్చని రేకలు మధ్యలో గింజలు నింపుకొన్న తొడిమతో సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు వాలుతూ ఒక అద్భుతమైన పుష్పం.ఈ పువ్వు గింజలతో తీసిన నూనె అందరికీ పరిచయమే. ఈ గింజలు పోషకాలకు నిలయం. 80కి పైగా పోషకాలున్న ఈ గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుతోంది. కొవ్వును కరిగించటంతో పాటు గుండెకు జబ్బుకీ, ఆస్తామా వ్యాధులకు కారణం అయ్యే ప్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది. మోనోఫాజ్ తో ఈ గింజలు తింటే మధుమోహం సమస్య తగ్గుతోంది. గర్భిణులకు మేలు చేసే పొలెట్లు మంచి కొలెస్ట్రాల్ ,పెంచీ కొవ్వులు ఎక్కువగానే ఉంటాయి. ఫ్యాటీ ఆమ్లాలు చర్మం మెరుపుకీ శిరోజాలు పెరుగుదలకీ తోడ్పడతాయి. ఈ గింజలు ఎలా తిన్న మంచివే.