హాయిగా నిద్రించి ఆరోగ్యం పొందటానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మంచి నిద్ర కోసం సౌకర్యంగా ఉన్న పరుపు కొనుక్కొవటం మంచి పెట్టుబడి అని గ్రహించాలి. శరీరానికి మెడ భాగానికి సౌకర్యంగా ఉండే దిండు ఎంచుకోవాలి. చాలా మందికి చిన్న అలికిడికే నిద్ర మెలుకవ వస్తుంది. శబ్ధం చేసే సీలింగ్ ఫ్యాన్, చుక్కలు చుక్కలుగా కారే పంపు శబ్ధం హటాత్తుగా మోగే మొబైల్ ఫోన్లు ఎక్కువ వెలుగు నిచ్చే లైట్ల కాంతిని తగ్గించుకోవాలి అనుకొంటే మందపాటి కర్టన్స్ కావాలి. మన శరీరంలో నిద్రకు ముందు కాస్త మత్తు కలిగించే మెలటానిక్ హార్మోన్ ను సృష్టించే యంత్రాంగం ఉంది. వెలుగులో పడుకొంటే ఆ మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. కాంతి వంతమైన లైట్లు లేకుండా కాస్త చీకటిగా ఉంటేనే చక్కని నిద్ర పడుతుంది.

Leave a comment