అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల పెళ్ళి ధూమ్ ధామ్ గా జరిగిపోయింది. ఇదేం అనుకోకుండా జరిగిపోలేదు, నేను మటుగు పెళ్ళి దుస్తులు తయారు చేయడం లో రోజుల తరబడి మునిగి పోయాను అంటాడు సవ్యసాచి. అనుష్కా శర్మలెహంగా పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేందుకు 32 రోజులు పట్టిందిట ఈ ప్రాముఖ్యత డిజైనర్ కు. లేత గులాబీ రంగు పాటర్న్ ను ఎంపిక చేసారు వధు వరుల కోసం. ఎంబ్రాయిడరీ బెనారసీ పాటర్న్ జత చేసిన రా సిల్క్ షేర్వాణీలో విరాట్ ఎంచక్కా వుంటే లియా గులాబీ రంగు లేహంగా దాని పైన బంగారు వెండి దారాల తో చేసిన జరీ పనితనం, డ్రెస్ ప్రత్యేకతకు తీసిపోకుండా అలంకరించిన అన్ కట్ డైమెండ్స్, జపనీస్ ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలతో సినీ పరిశ్రమలోనే అందమైన వధువుగా అనుష్క మెరిసి పోయారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకంతా డిజైనర్ డ్రెస్సులు నగలు, పూలదండలే, ఇక సెలబ్రెటీస్ పెళ్ళిళ్ళయితే ఇలా వుండాలి.

Leave a comment