ఫోర్బ్స్ మ్యాగజైన్ వందమంది శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు రోహిణి నాడార్ హెచ్. సి.ఎల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రోహిణి ఈ జాబిదాలో చోటు చేసుకోవటం ఇది నాలుగో సారి.హరూన్ రిచ్ లిస్ట్ ఇటీవల ప్రకటించిన జాబిదా లో భారత్ లో సంపన్న మహిళ పారిశ్రామిక వేత్తగా తొలి స్థానంలో నిలిచారు.ఆమె సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకు గా ఉన్నారు. అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. నాడార్ విద్యా జ్ఞాన్ ద్వారా పేద విద్యార్థులను చదివిస్తున్నారు. పారిశ్రామిక వేత్తగా విజయం సాధించడం కోసం ఉండవలసిన ప్రధాన లక్ష్యం రిస్క్ తీసుకోవటం అంటుంది రోహిణి నాడార్.

Leave a comment