కోవిడ్ వచ్చాక ఎన్నో కొత్త సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. రంగ రంగ వైభవంగా చేసే పెళ్లిళ్లు వెబినార్ లో చూసి అక్షింతలు వేస్తున్నారు అలాగే నవకాయ పిండి వంటలతో,ఎన్నెన్నో రకాల వంటకాలతో పెండ్లి విందు గుమగుమలాడేది.మరి కరోనా సమయంలో అందరూ రాలేరు కదా తమిళనాడు ఒక జంట ఇంకో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్లి రోజున కళ్యాణ సాపాడు పార్సల్ పంపించింది పెళ్లి పత్రికల్లో వధూవరుల పేర్లు ముహూర్తం వివరాలతో సహా ఇందులో ఉండే వంటల లిస్ట్ కూడా ఇచ్చారు.అన్ని రకాల పదార్థాలు బాక్సుల్లో ఇంటింటికీ పంపారు వెబినార్ లో పెళ్లి చూసి ఎవరింట్లో వాళ్లు కూర్చుని భోజనాలు చేస్తున్నారన్నమాట.

Leave a comment