Categories
మనం ఎంత అదృష్టవంతులమో ! ఈరోజు ఉదయం ఏ నొప్పి బాధ లేకుండా నిద్ర లేస్తే నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కంటే అదృష్టవంతులు కదా ఏ భయం లేకుండా ఆయుద్ధం లేకుండా చుట్టూ పదిమంది అనుచరులు లేకుండా హాయిగా తిరుగుతున్నాం అంటే భయం లేని జీవితం గడుపుతున్నట్లే కదా.ఈ రోజుకు సరిపోను డబ్బు చేతిలో ఉండి బ్యాంక్ లో భవిష్యత్తు కోసం కొన్నాళ్లకు సరిపోను డబ్బు ఉంటే ప్రపంచంలో ఎనిమిది శాతంగా ఉన్న అత్యంత ధనవంతుల్లో మనం కూడా ఉన్నట్లే తల్లిదండ్రులతో కలిసి తృప్తిగా ఉన్నావంటే ఈ ప్రపంచంలోని పదిహేను శాతంగా ఉండే అనాధ కుటుంబాల్లో మనం లేనట్లే.ఈ రాస్తున్న మాటలు చదవడం వచ్చు అంటే ప్రపంచంలోని 50 కోట్ల మంది నిరక్షరాస్యుల్లో మనం లేనట్లే కదా ఇంకా ఏదో లేదని, ఇంకేదో కావాలని అసంతృప్తిగా ఉంటే మనకు ఉన్న అదృష్టా లని తక్కువ అంచనా వేసినట్లు తృప్తికి మించిన సంపద లేనే లేదు కదా!
చేబ్రోలు శ్యామసుందర్
9849524134