నీహారికా,

చాలా మంది ఏడుపు నాకు నచ్చాడు. చీటికీ మాటికీ కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే ఎదుటి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం అంటారు. కానీ మానవ సంబంధాలను మెరుగు పరిచేందుకు, ఒకరి కొకరు అండగా నిలిచేందుకు కన్నీరు ఏర్పడిందన్న సిద్దాంతం కూడా  వుంది ఏడుపు మనుష్యులను దగ్గర చేస్తుంది. కన్నీరు పెట్టుకోవడం అంటే మనిషి లోని నిస్సాహాయతను వ్యక్తీకరించడం మనసులో ఏర్పడ్డ, బాధ దిగులు ను ఎదుటి వాళ్ళని చెప్పటం గా అర్ధం చేసుకోవాలి. పసి పిల్లలు తమ బాధ వ్యక్తం చేసే తీరు కన్నీటితోనే. భావోద్వేగంతో కూడిన ఏడుపు ఎదుటి వారికి ఆ అనుభవాన్ని అందించి వాళ్ళ చేత కుడా కంట తడి పెట్టిస్తుంది. ఇది ఒక రకంగా కుటుంబంలో, సమాజంలో బాధను పంచుకునేందుకు, బాధని వ్యక్తం చేసి మనస్సు బరువు దింపు కునేందుకు చేసే ప్రయత్నం. ఎదుటి మనిషి కన్నీటికి, మన మనస్సు లో దయ కరుణ మొలకెత్తుతాయి. కన్నీటి కున్న విలువ ఇది. అది మానవవత్వపు అంకురాన్ని మొలకేట్టిస్తుంది. ఒక మనిషి నిస్సహాయంతో కన్నీరు మున్నీరవ్వుతుంటే మనం భరించ లేకపోతాం. అంటే మనస్సు మెత్తనై సాటి మనిషి కరుగుతుందని అర్ధం. కన్నీ ఎంత విలువైంది.

Leave a comment