ప్రతి సారి పెదిక్యుర్ కోసం బ్యూటిక్లీనిక్ కు పోవాలంటే టైం దొరక్క పోవచ్చు. పాదాలకు సంబంధించి కష్ట జాగ్రత్త తీసుకుంటే పెడిక్యుర్ కంటే చక్కని ఫలితం ఇస్తుంది. పాదాలపై మురికి పోగొట్టాలంటే పాల పొడిలో గులాబీ నీళ్ళు కలిపి పాదాలకు పూతలా వేసి కాసేపు అయ్యాక కడిగేస్తే మురికి వదిలి పోతుంది. గంధం పొడి, టమాటో గుజ్జు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి ఆరనిచ్చి కడిగేసినా ఫలితం కనిపిస్తుంది. సెనగపిండి నీళ్ళు, నిమ్మరసం, పసుపు కలిపి పాదాలకు పూత వేసినా నిమ్మచెక్క పైన, కష్ట ఉప్పు, లేదా పంచదార వేసి దానితో నెమ్మదిగా మసాజ్ చేసినట్లు రుద్దినా పెడిక్యుర్ ఫలితం కాళ్ళ పై కనిపిస్తుంది.

Leave a comment