అరుణాచల్ ప్రదేశ్ లో రోడ్ సైడ్  లైబ్రరీల ఉద్యమం మొదలైంది నారాంగ్ మీనా అనే గిరిజన స్కూల్ టీచర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి గంట దూరంలో ఉండే నిర్జులి అనే ఊర్లో రోడ్ సైడ్ లైబ్రరీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 20 వేలు ఖర్చు చేశాను అంటోంది నారాంగ్ మీనా పదివేల రూపాయలు పుస్తకాలు పదివేలతో బుక్స్ పెట్టుకొనే పుస్తకాల రాక్ రెండు బల్లలు రాత్రివేళ చదువుకునేందుకు రెండు లైట్లు ఏర్పాటు చేసింది. మా రాష్ట్రంలో వైన్స్ షాప్స్ కు మించి లైబ్రరీలు కనిపించాలి.గ్రంథాలయం మనసుకు చికిత్సాలయం అంటుంది మీనా. ఈ లైబ్రరీలో పుస్తకాలు చదువుకోవచ్చు, తీసుకోవచ్చు, కొత్తవితెచ్చిపెట్టొచ్చు ఆమె అన్నట్లు, గొప్ప మెడళ్లు రెండు చోట్ల తయారవుతాయి ఒకటి తరగతి గదిలో రెండు గ్రంథాలయంలో.

Leave a comment