సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి దాకా  తగ్గిపోతుంది. బద్ధకం వదిలించుకోవటం కోసం సూర్యకిరణాలు తగిలేలా గడపటమే పరిష్కారం. మంచి పోషకాలున్న టిఫిన్ తీసుకుంటే శరీరంలో శక్తి నిల్వలు పెరుగుతాయి. తప్పనిసరిగా సింపుల్ ఏరోబిక్స్. ధ్యానం ప్రాణాయామం రిలాక్సేషన్ పద్ధతులు ఉపకరిస్తాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా పని సామర్ధ్యం తగ్గిపోతుంది. అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గి మెదడు పని విధానం నెమ్మదిస్తుంది. దప్పిక అయ్యేవరకు ఆగకుండా నీళ్లు తాగాలి. కార్బోహైడ్రాట్స్ చక్కర తక్కువగా వుండే పదర్ధాలు తినాలి. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. చల్ల గాలి వస్తున్నా కిటికీలు తీసేవుంచాలి. పడుకునేముందర వేడినీళ్లు స్నానం వల్ల కొత్త ఉత్తేజం కలుగుతుంది. చక్కని నిద్రకోసం ఉపకరిస్తుంది. సీజన్ ఏదైనా వాతావరణం ఎలా వున్నా దేనినైనా హాయిగా ఎంజాయ్ చేయాలి.

Leave a comment