అందమైన ప్రకృతి లో ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. శతవిధాల ప్రయత్నం చేసినా మానవ మేధకు అందని అపురూపమైన మిస్టరీలు కొన్ని అలాగే మిగిలిపోయాయి. ఒకసారి కోస్టారీకా లో దట్టమైన అడవులు తగలబెట్టి నేలను చదును చేస్తున్న సమయంలో అక్కడ గుండ్రని టెన్నిస్ బంతులు లాంటివి రాతి బంతులు కనిపించాయి. చిన్నవే కాక 16 టన్నుల బరువైన బంతులు అనేక పరిమాణాల్లో బయటపడ్డాయి. అవి వేల సంవత్సరాల నాటివి ఎవరు ఎందుకు తయారు చేశారో ఎవ్వళ్లకీ  అంతుపట్టలేదు. అలాగే ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్‌ పర్వతశ్రేణి లో ది వేలీ ఆఫ్ పేపర్స్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ 143 డిగ్రీల ఉష్ణోగ్రత తో ఎనిమిది లక్షల గ్యాలన్ల నీరు నిత్యం బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. అదికూడా వడబోసిన నీరంత స్వచ్ఛంగా ఉంటుంది. దీని పక్కనే దగ్గరలో చల్లని నీటి గుండం ఉంది. దీన్ని స్లీపింగ్ వాటర్స్ అంటారు.ఈ రెండిట్లో స్నానం చేస్తే సర్వ రోగాలు మాయం అవుతాయి అంటారు.  ఇప్పుడా ఆ ప్రాంతాన్ని హాట్ స్ప్రింగ్ నేషనల్ పార్క్ పేరుతో రూపం మార్చారు. ఇప్పటికీ ఈ నీళ్ల  గురించిన మిస్టరీ ఏమిటో తెలియలేదు. అమెరికా లోని క్యాలిఫోర్నియా లో సముద్ర మట్టానికి 1130 మీటర్ల ఎత్తులో ఒక ఎండిపోయిన విశాలమైన సరస్సు ఉంది దీన్ని డెత్ వ్యాలీ అంటారు. ఇక్కడ మనుషులు, జంతువులు ఎవ్వళ్ళూ వెళ్లారు. ఈ ప్రాంతంలో బండరాళ్లు ఏ వత్తిడికి కదలుతాయో తెలియదు కానీ వాటంతట అవే కదులుతుంటాయి. ఈ డెత్ వ్యాలీ లో ఇంకో అండర్ గ్రౌండ్ పట్టణం కూడా ఉందట ఇందులో కళాఖండాలు మమ్మీలు ఉన్నాయి. ఎవ్వరు భద్రపరచరో ఇప్పటికీ ఎవ్వరు కనిపెట్టలేకపోయారు.

Leave a comment