వర్క్ ఫ్రమ్ హోం తో కదలకుండా ఇంట్లో ఉండి, ఏ జిమ్ కో వెళ్లి వ్యాయామాలు చేయడం కూడా కష్టమైపోయి బరువు పెరిగిపోతామని భయపడే అమ్మాయిలకు పోనీ ఇవి తినండి, ఇవి వాడండి జీరో సైజు కి వచ్చేస్తారు అంటున్నారు అధ్యయనకారులు. రోజుకో అరటిపండు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. బనానా డైట్ తో పాటు వ్యాయామం చేస్తే అధిక బరువు తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు. గోధుమ రవ్వ ను ప్రధాన ఆహారంగా తీసుకుంటే కూడా మంచి ఫలితం పొందవచ్చు. చేప నూనె కూడా బరువు తగ్గించగలదు అని పరిశోధనలు రుజువు చేశాయి. ఇక జీలకర్రలతో జీరో సైజ్ గ్యారెంటీ అంటున్నారు నిపుణులు. దీనిలోని పోషకాలు మంచి ఆక్సిడెంట్స్ మెటబాలిజం అభివృద్ధి చేసి కేలరీలు పెరిగేందుకు సహాయపడతాయి. విటమిన్-సి జలుబు వంటి సమస్యలకు ముందుగానే రాకుండా అధిక బరువు తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగిన తేనె ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని. ఇది కొవ్వును సులభంగా కరిగించగలదని చెబుతున్నారు. ఆహార పదార్థాల తయారీలో కొబ్బరి నూనె వినియోగం పెరిగితే కొవ్వు కరిగిపోతుంది. అలాగే పాలు, పాలు ఆధారిత ఉత్పత్తులు వాడేవారిలో బరువు తగ్గటంతో పాటు కొవ్వు గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు. ఈ ఆహారంతో పాటు కనీసం అరగంట పాటు వ్యాయామం ఎంతో ముఖ్యం అంటున్నారు పరిశోధకులు.

Leave a comment