పాల కంటే విలువైనవి. ఆరోగ్యాన్నిచ్చేవి ఇంకేవీ లేవు ప్రొటీన్లు కాల్షియం, పొటాషియం తోపాటు ఎ,బి, డి విటమిన్లు ఉంటాయి. మామూలు పాలే కాకుండా డైరీ మిల్క్ అయినా కొబ్బరి, బాదం, సోయాపాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే అంటున్నారు ఎక్సపర్ట్స్ . పచ్చి కొబ్బరి నుంచి తీసే కొబ్బరి పాలు తియ్యగా ఉంటాయి. ఈ పాలలో కేలరీలు ఎక్కువ ఫైబర్ అధికం కనుక ఈ పాల కు బరువు తగ్గించే గుణం ఉంది. ఈ పాలల్లో సహజంగానే బ్యాక్టీరియా వైరస్ ను అంతం చేసే గుణం ఉంది. అలాగే బాదం పాలలో కూడా మినరల్స్, మాంగనీస్, సెలీనియం, ఐరన్ తో పాటు బి- విటమిన్ అధికంగా ఉంటుంది వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయి. విటమిన్-ఇ తో చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది. సోయా పాల లో బరువు తగ్గించే గుణం ఎక్కువ. పశువుల నుంచి తీసిన పాలను ఇష్టపడని వీగన్స్ సోయా పాలు తాగుతారు ఇందులో లాక్టోజ్ ఉండదు తాగిన వెంటనే శక్తి వస్తుంది.సాధారణంగానే ఓట్స్ ను బరువు తగ్గించేందుకు తీసుకుంటారు. ఓట్స్ పాలు బరువును పెంచావు. వీటిలో విటమిన్స్ తో పాటు క్యాల్షియం అధికం. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆవు పాలతో పోలిస్తే ఇందులో ఎ-విటమిన్ అధికంగా ఉంటుంది. ఆవు, గేదె పాల లాగే ఈ పాలన్నీ కూడా ఆరోగ్యాన్నిచ్చేవే.

Leave a comment