ఇంకా చల్ల గాలులు వస్తూనే ఉన్నాయి. ఈ చల్లని రోజులో వెచ్చదనం ఇచ్చే ఆహారం కావాలి. జలుబు,ఫ్లూ,జ్వరాలు ఔషధంగా తేనె ఉపయోగించాలి. అల్లం తులసీ టీ శరీరానికి స్వాంతన ఇస్తుంది.చలి కాలంలో నెయ్యి శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా ఖర్జురాలు,ఆప్రికాట్స్ వంటివి తింటే వళ్లు వెచ్చగా ఉంటుంది. బెల్లం తినటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. దాల్చిన చెక్క వాడకం కూడా చాలా మంచిది. గోరు వెచ్చని పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని తాగితే శరీరానికి వేడి అందుతుంది. వేడివేడి సూప్స్ మంచివి. అలాగే నువ్వులు కూడా ఈ సీజన్ కు చాలా ఉపయోగం.

Leave a comment