ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లో నైజీరియన్ చిత్రకారుడు ఆస్కార్ ఉకోను(Oscar ukonu) పెన్ డ్రాయింట్స్ కనిపిస్తాయి. బాల్ పాయింట్ పెన్ తో అచ్చం ఫోటో లాంటి చిత్రాలు ఎంతో గొప్పగా నైపుణ్యంతో గీస్తారు అంటే వాటిని చూస్తుంటే హై రిజల్యూషన్ ఫోటో లేమో అనిపిస్తాయి. చిత్రకారుడు ఆస్కార్ తన తొమ్మిదవ ఏటా నుంచే పెన్సిల్ తో బొమ్మలు గీస్తున్నాడు. 2014లో మొదటిసారిగా ఆర్కిటెక్చర్  చదివే సమయంలో బాల్ పాయింట్ పెన్ పట్టుకుని హైపర్ రియల్ స్టిక్ పోర్ట్ రైట్స్ ని గీస్తున్నాడు. సాధనకు ఓపిక మాత్రమే తన చిత్రాలకు ప్రాణం పోస్తాయి అంటున్నాడు ఆస్కార్. ఒక బొమ్మ గీసేందుకు 200 గంటల నుంచి 400 గంటల సమయం పడుతుంది. ముందుగా ఎవరి బొమ్మ గీస్తున్నారో ఆ వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. ప్రతి చిన్న వివరాన్ని నోట్ చేసుకుంటాడు. కనీసం వాళ్ళవి వంద ఫోటో లైనా తీస్తాడు వాటిని ఫోటో షాప్ చేసుకుని, చక్కగా స్టడీ చేసి ఆ తర్వాత గీస్తాడు. నల్ల వాళ్ళ బొమ్మలు గీయడం చాలా ఇష్టం. ఆఫ్రికన్ జీవిత చిత్రాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటారు. కొందరి సెలబ్రెటీల బొమ్మలు కూడా గీశాడు అవన్నీ చూస్తుంటే బాల్ పాయింట్ పెన్ తో ఇంత అద్భుతాన్ని సృష్టించటం ఎంత గ్రేట్ అని అనిపించక మానదు.

Leave a comment