సంక్రాంతి ముగ్గుల్లో ఖగోళ శాస్త్ర రహస్యాలు ఉన్నాయంటారు ఆవుపేడతో కలిపి చల్లిన నేల ఆ ఆకాశానికి సంకేతం తెల్లని ముగ్గుతో పెట్టే చుక్కలు నక్షత్రాలకు సంకేతం. మూడు నిలువు మూడు అడ్డంగా పెట్టే చుక్కలు ముగ్గు నవగ్రహాలకు సంకేతం చుక్కల్ని కలుపుతూ ముగ్గులు వేసే తీరు గ్రహాల నడకకు సంకేతం నాలుగు వైపులా హద్దులుగా గీసే రెండు సరి రేఖలో గ్రహాలు పరిధిని సూచిస్తాయి. ప్రతి ముగ్గు లో మధ్యలో వచ్చే గడి సూర్యునికి సంకేతం అందుకే ఆ గడిని ఎర్రని కుంకుమ తో అలంకరించి పూలతో పూజిస్తారు పూర్వం ఈ ముగ్గు లోనే గ్రహాలని దర్శించే వారట ఈ గ్రహ దోషానికి ఏమి దానం ఇవ్వాలో గృహిణుల అగడిల్ని ఆయా ధాన్యాలతో నింపే వాళ్ళు సూర్యుడి గడి ని గోధుమలు, చంద్రుని గడి ని బియ్యం ఇదే తీరుగా అన్ని గడులను  నింపే వాళ్ళు.   ఇలాగే అన్నీ ముగ్గులు అర్ధవంతంగా   వేసే వాళ్ళు. ఈ గడుల్లో నింపిన ధాన్యాలను పక్షులు చీమలకు కనుక అనుకునేవాళ్ళు. రైతు పండించిన ధాన్యం సమస్త జీవరాశులకు చేరాలన్న మాటే కదా.

Leave a comment