వర్షాలు బాగా కురుస్తుంది. బయట అడుగు పెట్టి తడిసి పోయి రావడమే అవ్వుతుంది. ఇక దగ్గు జలుబు వంటి సమస్యలు మొదలు అలా జలుబు భారం గా వుంటే శొంటి కాఫీ తాగితే ఫ్రెష్ గా వుంటుంది. ఏం కష్టం కాదు. మరుగుతున్న టీ డికాషన్ లో కాస్త శొంటి పొడి వేయాలి. అల్లం ఎండబెడితే శొంటి అవ్వుతుంది. ఈ సొంటిని పొడి చేసి ఎన్నో అనారోగ్యాలకు ముందుగా వాడవచ్చు. వేడి వేడి అన్నంలో శొంటి పొడి ఉప్పు కలుపుకుని పప్పు నూనె వేసుకోని ప్రతి రోజు రోజు మొదటి ముద్దగా తింటే ఆకలి బావుంటుంది అజీర్తి చేయదు. అలాగే పరగడుపున వీళ్ళలో శొంటి పొడి కలిపి మరగబెట్టి అందులో ఆర చెంచా తేనె కలిపి కాఫీ లాగా తాగితే కోలెస్ట్రోల్ తగ్గుతుంది బరువు అదుపులో వుంటుంది.

Leave a comment