నీహరికా,

విలువైన రిపోర్ట్ వచ్చింది శ్రద్దగా విను. వత్తిడి త్గ్గించుకొంటే ఎన్నో అనారోగ్యాలు పోతాయని, ముఖ సౌందర్యం మెరుగు పడుతుందని, అకాల వార్ధాక్యం రాకుండా ఉంటుందనీ, జుట్టూ రాలిపోదనీ ఎన్నో చదువుతాం. మరి ఇన్ని లాభాలుంటే వత్తిడి ఎలా తగ్గుతుందో తెలిస్తే తగ్గించుకోవచ్చు. లోపలి నుంచి టెన్షన్స్, సమాదాలు లేని ప్రశ్నలు పుట్టుకు వస్తుంటే వత్తిడి చేరుకోదా? పెరగదా? అయితే పుస్తక పటనం వల్ల వత్తిడి స్థాయి 67 శాతం తగ్గుతుందని ఇప్పటి తాజా రిపోర్ట్స్. సంగీతం వింటే 60 శాతం, లేదా ఒక కప్పు టీ తాగితే 54 శాతం వత్తిడి తగ్గితే, నచ్చిన పుస్తకాన్ని ఏ సమయంలో చదువు కొన్న ఆ అనుభూతి వత్తిడిని మాయం చేస్తుందని రిపోర్ట్. పుస్తకం మనసుని మరో ప్రపంచంలోకి తీసుకుపోతుంది. సంతోషాన్ని ఇస్తుంది. ఏ సమయంలోనైనా పుస్తకం నేస్తమే. మెదడులోని మూడ్ రేగ్యులేటింగ్ ప్రదేశాన్ని పుస్తకం  ఇచ్చే సంతోషం ఉత్తేజ పరుస్తుంది. మనకిష్టమైన పుస్తక పటనం మనకిస్తున్న వరం ఇది. కాదంటావా?

Leave a comment