ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ పూజ ఉమా శంకర్ విమానాశ్రయం లో ఈ రంగానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ విమానం ఎగిరే ముందర ఇంధన స్థాయి, టైర్లలో ప్రెషర్, లైట్లు అన్ని యంత్రాలు సరిగ్గా చెక్ చేసి ఎగిరేందుకు అనుమతి ఇచ్చే విభాగం ఇది. ఏరోనాటికల్ ఇంజనీర్ గా బాధ్యత తీసుకున్న ఉమాశంకర్ ప్రపంచవ్యాప్తంగా విమాన నిర్వహణ విభాగంలో 2.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని చెబుతోంది. ఎండ వానల్లో పనిచేయాల్సిన ఈ ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఈ విభాగం లోకి మహిళలు ఎక్కువగా వస్తే బాగుంటుంది అంటోంది.

Leave a comment