ఔషధ మూలికలుగా పెరిగే ఎన్నో మొక్కల్ని మనం పట్టించుకోము.. అలంటి వాటిల్లో పుదీనా ఒకటి. వేసవి వస్తోందంటే పుదీనా షర్బత్ పుదీనా ఆకులు వేసిన మజ్జిగ తాగి తేటగా వుంటారు. ఇందులో మెంథాల్ కారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు తగ్గుమొహం పడతాయి. పుదీనా ఆకులు నోటిని శ్వాసనీ  తాజాగా ఉంచుతాయి. దోమ కాట్లకు దద్దుర్లకు ఇతరత్రా అలర్జీలకు పుదీనా తో చేసిన నూనె ఎంతో ఉపయోగం. ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు  విటమిన్లు ఖనిజాలు అంటే మనకు కూరగాయలు పండ్లే గుర్తొస్తాయి. కానీ పుదీనా లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు గాను యాంటీ ఇన్ఫలమేటరీ గానూ పనిచేసే మారినిక్ ఆమ్లం పుదీనాలో వుంది . ఇది అలర్జీలు తగ్గిస్తుంది. ఇందులో ఉండే మెంథాల్ శేష్మం తగ్గిస్తుంది. దీనితో చేసిన టీ తాగటం వల్ల  గొంతు నొప్పులు తగ్గుతాయి. అజీర్తిని గ్యాస్ట్రిక్ సమస్యని త్రేపుల్ని నిరోధిస్తుంది. పుదీనా టీ  బడలికను  కూడా తగ్గిస్తుంది. పుదీనా పచ్చడి రుచి గురించి కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చటం ఉత్తమం.

Leave a comment