అద్దంలో చూసుకుంటూ నేను భలే బాగున్నాను. నేను చాలా అందమైన దాన్ని అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఇలా సంతృప్తి పడటం ఎంతో మంచిదనీ ఇలా అనుకోవటం వల్ల వాళ్ళ జీవితంలో వచ్చే ఎన్నో రకాల వడిదుడుకుల్ని సమర్ధవంతంగా ఎదుర్కునే మానసిక ధైర్యం ఉంటుందనీ చెపుతోంది ఒక పరిశోధన ఎలాగంటే తమ రూపం బరువు పట్ల సంతృప్తిగా ఉన్నవాళ్లకి ఆనందంగా వుంటుందనీ వాళ్ళకి జీవితంలో నిరాశ సంతృప్తి ఎదురవదనీ ఒక వేళ ఎదురైనా తమకుండే పాజిటివ్ ఫీలింగ్ తో ప్రతి కష్టాన్ని ఎదుర్కొటారనీ చెడుతున్నారు. 12 వేల మందిపై జరిపిన పరిశోధన ఫలితం ఇది. వాళ్ళ వ్యక్తిత్వము దాంపత్య జీవితము గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారట. అందుకనే సంతృప్తికరమైన సమాధానాలు వచ్చాయి. ఆర్ధిక స్థితి దాంపత్య జీవితం కుటుంబం స్నేహాలు అన్నింటి పట్ల సంతృప్తిగానే ఉన్నారు వాళ్లు తగు రూపాన్ని ప్రేమించుకోలేనివాళ్ళు తమపట్ల తమకే నమ్మకం లేనివాళ్లుగా ఉంటారనీ కనుక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చాలా మంచిదనీ సర్వే రిపోర్ట్. కరెక్ట్ అనిపిస్తోంది కదూ.