ఎన్నో రిపోర్టులు చూస్తూ వుంటాం. ఏ కూల్ డ్రింక్ తాగినా ఎదో ఒక సమాసే అంటాయి రీసెర్చులుమరి చల్లగా ఏం తాగాలి. దాహం వేస్తె అస్తమానం మంచినీళ్ళే అయిటే  కూల్ డ్రింక్స్ తాగినా ఫ్రెష్ నెస్ ఎలా వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం   లస్సీ  అంటున్నారు ఎక్స్ పర్ట్స్. భారతదేశపు పానీయం లస్సీ. ఉప్పుతీపి తో ఎలా తాగినా అత్యుత్తమేనని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తుంది. పండ్ల రసాలు, కృత్రిమ డ్రింక్స్ ఏవైనా సరే లస్సీ ముందు తీసికట్టే పెరుగు నుంచి తయ్యారు చేసే లస్సీ శరీరానికి సంపూర్ణ రక్షణ . ఇప్పుడు అమెరికా లోని భారతీయ రెస్టారెంట్స్ లో లస్సీ కే డిమాండ్. పెరుగుకు తాజా పండ్ల రసాలు, ఇతర దినుసులు కలిపి అందించే ఈ ఆరోగ్య పానీయం ద్వారా కాల్షియం, విటమిన్  స, ప్రోటీన్ లు సమృద్దిగా దొరుకుతాయి. అపిగా లస్సీ తాగితే బరువు పెరుగుతామనే భయం కుడా వుండదు.

Leave a comment