మెడచుట్టూ, మోచేతులు, మోకాళ్ళు నల్లగా కనిపిస్తాయి. ప్రాచీన వైద్యం ఎం చెప్తుందంటే కలబంద గుజ్జుని రెగ్యులర్ గా రాస్తే తప్పని సరిగా తగ్గిపోతుందనిఅంటుంది. వైద్యులు స్కిన్ లైటనింగ్ క్రీమ్ వాడండి. ఉదయం పూట మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్పని సరిగా రాయమంటారు. బ్యూటీ పార్లర్ కి వెళితే బ్లీచ్, స్క్రబ్ తో నలుపు మాయం అంటునారు. కానీ ఇంటి వైద్యం చిన్ని చిట్కాలు పాటించమంటుంది. నువ్వుల నూనె లో ఫ్యాటి యాసిడ్స్ చర్మాన్ని మెరిపిస్తాయంటుంది. వారానికి ఒకసారి నువ్వుల నూనె తో వళ్ళు మసాజ్ చేసుకొని శనగ పిండి గానీ, సున్ని పిండిగానీ నలుగు పెట్టుకొని స్నానం చేస్తే నలుపు త్వరగా పోతుంది. చర్మం కాంతిగా ఉంటుంది అంటుంది. బ్లీచ్ లు, స్క్రబ్ లు అక్కర్లేదు కానీ, వైద్యులు చెప్పినా, ప్రాచీన వైద్యం సలహానో, ఇంటి చిత్కాలనో పాటిస్తే ఏ సిదె ఎఫెక్ట్ లేకుండా చర్మం మెరుగు పడుతుంది.

Leave a comment