బరువు తగ్గించుకోవటం కోసం లో ఫ్యాట్ డైట్ తీసుకొనే మహిళల్లో సంతాన అవకాశాలు తక్కువ అవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి.మిగతా ఆరోగ్యవంతమైన భోజనం చేసే మహిళలతో పోలిస్తే 27శాతం సంతాన అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనాల సారాంశం. సరైన ఓవ్యూలేషన్ ప్రక్రియ కోసం ఆరోగ్యవంతమైన శరీర బరువు కావాలి ,అలాగే శరీరంలో కొన్ని స్టెరాయిడ్లు ఉత్పత్తికి కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది. లో ఫ్యాట్ పదార్థాల కారణంగా వాటిలోని కొన్ని ఆర్టిఫిషియల్ పదార్ధాలు ఇన్ ఫెర్టిలిటీకి దారి తీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. శరీరానికి కావలిసిన కొవ్వులు తప్పనిసరిగా అందాలంటున్నారు.

Leave a comment