నెలసరి లో శరీరం బరువుగా ఉండటం పొత్తికడుపులో నొప్పి వంటివి బాధపడుతూ ఉంటే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండమంటున్నారు ఎక్సపర్ట్స్.శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండే పదార్థాలు తినకూడదు మాంసాహారం, పాల ఉత్పత్తుల ద్వారా అందే ఈ కొవ్వులు ఈస్ట్రోజన్ హార్మోన్ పై నేరుగా ప్రభావం చూపెడతాయి. వీటిలో ఉండే ఒక రకమైన ఆమ్లం గర్భాశయ, సంకోచ వ్యాకోచాలను ప్రేరేపించే  ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల స్తనాల్లో సలపరం శరీరం బరువు వంటి సమస్యలు వస్తాయి. శీతలపానీయాలు కాఫీ కూడా నెలసరి నొప్పులను పెంచేవే అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment